గిరిజన ప్రాంతాల్లోని సహజ ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుభరోసా కేంద్రాలకు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్లను అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక నుంచి గిరిజన ఉత్పత్తుల కొనుగోళ్ల ప్రక్రియ భరోసా కేంద్రాల ద్వారా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు ఇచ్చారు. దీనిద్వారా కొనుగోలు, మార్కెటింగ్ ప్రక్రియలు సమన్వయంతో సాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవీ చదవండి..