RTC MD Dwaraka Tirumalarao Respond: ఆర్టీసీ బస్సులో 'గొడుగు' ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు స్పందించారు. సాలూరు డిపోకు చెందిన ఆల్ట్రా డీలక్స్ బస్సు రూఫ్ లీకేజీ జరిగిందని, లీకేజీ కారణంగా వెంటనే బస్సును ఆపి మరమ్మతులు చేపట్టినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.దీనికి కారణమైన సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. బస్సులన్నీ తనిఖీ చేసి, లీకేజీ ఉన్న బస్సులను వెంటనే ఆపివేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. మరమ్మతులు చేసిన తర్వాత మాత్రమే సర్వీసులు తిరిగి ప్రారంభించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1321 పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను రూ.15 కోట్లతో నవీకరణ చేసినట్లు ఎండీ తెలిపారు. సూపర్ లగ్జరీ, ఆల్ట్రాడీలక్స్, ఎక్స్‌ప్రెస్ కలిపి మొత్తం 1064 బస్సులను వచ్చే మార్చిలోపు నవీకరణ పూర్తి చేయనున్నట్లు ఎండీ తెలిపారు. బస్సుల కండీషన్‌ను మెరుగుపరచి ప్రయాణికులకు సౌకర్యంగా చేస్తున్నామని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Umbrellas in RTC bus: వర్షంలోనో.. ఎండలోనో గొడుగు వేసుకుని వెళ్లడం చూస్తుంటాం... కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు గొడుగు వేసుకుని వెళ్లడం ఎప్పుడైనా చూశారా.. అలాంటి అనుభవమే విశాఖ నుంచి సాలూరు వెళ్తున్న అల్ట్రా డీలక్స్ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు చూడాల్సింది వచ్చింది. ఆదివారం రాత్రి జోరుగా వర్షం కురవడంతో బస్సు టాప్ నుంచి నీరు ధారల్లా కారింది. గొడుగులు తెచ్చుకున్న కొందరు.. బస్సులోనూ వాటిని వేసుకుని ప్రయాణించారు. గొడుగులు తెచ్చుకోని వారు మాత్రం.. బస్సులో తడుస్తూనే ప్రయాణించాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: