ఆర్టీసీ యాజమాన్యం కో - ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ... సీసీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. సీసీఎస్‌కు ఇవ్వాల్సిన 260 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని ఈయూ నేతలు స్పష్టం చేశారు. మూడు నెలలుగా సీసీఎస్ నుంచి లోన్లు మంజూరు కాక ఆర్టీసీ కార్మికులు ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రుణం కోసం ఆర్టీసీ సీసీఎస్‌లో 3 వేల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని.., రుణాల మంజూరుకు అవసరమైన 100 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. ఆర్టీసీ సీసీఎస్ దివాలా తీస్తోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఈయూ నేతలు స్పష్టం చేశారు.