ఏపీఎస్ఆర్టీసీ(APSRTC)లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 1800 మందికి.. కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్(RTC EU) సీఎం జగన్ను కోరింది. ఈ మేరకు యూనియన్ నాయకులు.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కొవిడ్ సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు.. వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని సీఎం ఇచ్చిన ఆదేశాలపై.. యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కానీ, అలా చేస్తే కేవలం 300 మందికి మాత్రమే లబ్ది చేకూరుతుందని.. మిగిలిన 1500 కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు.
అందరికీ న్యాయం చేసేలా ఆర్టీసీలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని.. లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.
ఇదీ చదవండి: CM Jagan Review: ఉద్యోగ కల్పన దిశగా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలి: సీఎం జగన్