రాష్ట్ర సరిహద్దుల్లో 550 ఎకరాల్లో సాగుచేస్తున్న రూ. 104 కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు(Rs.104 crore worth of cannabis plants destroyed). 66 బృందాలు.. నాలుగు మండలాలు, 14 గ్రామాల్లోని గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు(destroyed cannabis plants on 550 acres).
దీంతోపాటు బుధ, గురువారాల్లో వివిధ రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయి, 6,907 కేజీల వెండి, గుట్కా, మద్యం సీసాలను స్వాధీనం(ganja and gutka seized by seb in trains) చేసుకున్నామని.. 23 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
విశాఖ మన్యంలోని పాడేరు, జీ. మాడుగుల, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లోని యువకులు,స్థానికులకు గంజాయి వల్ల వచ్చే నష్టాలపై వివర అవగాహన కార్యక్రమాలు(awareness to people on ganja) నిర్వహించారు.
ఇదీ చదవండి:
TDP leaders : 'కుప్పం ప్రత్యేక అధికారి వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నారు'