ETV Bharat / city

ఈనెల 26న  రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం : తులసిరెడ్డి - Farmer

50 రోజుల వైకాపా పాలనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 39 మంది రైతులు మృతి చెందారని ఏపీసీసీ ఉపాధ్యాక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. రైతు సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి ఈ నెల 26న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.

ఏపీసీసీ ఉపాధ్యాక్షులు తులసిరెడ్డి
author img

By

Published : Jul 22, 2019, 10:04 PM IST

వైకాపా పాలనలో రాష్ట్ర రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయిందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని దుయ్యబట్టారు. 50 రోజుల వైకాపా పాలనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 39 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వారి కుంటుంబాలను ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ పరామర్శించకపోవటం శోచనీయమన్నారు. రైతు భరోసా పథకానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజనతో కలిపి సాయం అందించడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయంలో బాకీ ఉన్న రుణమాఫీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి ఈ నెల 26న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.

ఇదీచదవండి

రాజధాని వైకాపా సొంత జాగీరు కాదు: చంద్రబాబు

Intro:ప్రభుత్వం స్పందన పేరుతో చేపడుతున్న గ్రీవెన్స్ కు అర్జీదారులు తరలివచ్చారు. అత్యధికంగా రేషన్, పెంక్షన్, ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెద్దఎత్తున వచ్చాయి. అర్జీల నమోదులో ఆలస్య జరగడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు ఉక్కపోతతో క్యూ లైన్ లో నిలుచుని అర్జీలు అందించేందుకు అవస్థలు పడ్డారు. మొత్తంగా వెయ్యికి పైగా అర్జీలు వచ్చాయి

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.