ETV Bharat / city

రూ.50 లక్షలు మాయం.. సిబ్బందిపైనే అనుమానం! - విజయవాడలో వైద్యుడి ఇంట్లోచోరీ

విజయవాడలో వైద్యుని ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 50 లక్షల రూపాయలు మాయం కావడంపై.. కేసును పోలీసులు సవాల్​గా తీసుకున్నారు. వైద్యుడు మురళీధర్ పీఆర్వోతో పాటు ఆసుపత్రిలో సన్నిహితంగా ఉండే వారిని విచారణ చేశారు.

robbery in  doctor house
robbery in doctor house
author img

By

Published : Sep 16, 2020, 6:39 AM IST

విజయవాడలోని మొగల్రాజపురంలోని సిద్ధార్ధనగర్​లో సోమవారం జరిగిన రూ.50 లక్షల దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాధితుడు ఆయుర్వేద వైద్యుడు శిరివెళ్ల మురళీధర్ ఆసుపత్రి సిబ్బందే.. ఈ చోరీకి యత్నించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ దొంగతనం కేసులో ఆసుపత్రిలో పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు.. గతంలో పనిచేసి మానేసిన వ్యక్తులు సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. చోరీకి పాల్పడిన నలుగురికి, వీరికి మధ్య ఒప్పందం ప్రకారం దోచుకున్న నగదును వాటాలుగా పంచుకున్నారు.

ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని కొంత నగదును రికవరీ చేసినట్టు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక బృందాలు.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాయి. దొంగతనం జరిగిన ఇంటికి వచ్చే మార్గాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అలాగే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన రోగుల జాబితాను సిద్ధం చేశారు. వీరిలో ఎవరైనా ఈ నేరానికి పాల్పడి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 8,846 కరోనా కేసులు, 69 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.