చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మరణించాడని... బస్సులోని 53 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని గన్నవరం పొలీసులు తెలిపారు. మృతుడిని తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా బాలాసోర్ వాసి విఠల్ వేలు (27) గుర్తించారు.
గత రాత్రి ఒడిశా నుంచి తిరువనంతపురం వెళ్లే ట్రావెల్స్ బస్ కీసరపల్లి వద్ద ఒక్కసారిగా టైర్ పేలడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. తొలుత ఎదుటి వాహనాన్ని ఢీ కొట్టి.. తర్వాత డివైడర్ ఎక్కిందని వివరించారు. డ్రైవర్ మృతి మినహా బస్సులోని అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా.. ప్రయాణికులను గమ్యస్థానాలకు సీఐ శివాజీ బృందం తరలించిందని.. తెలిపారు.
ఇదీ చదవండి: