పశ్చిమబంగా నుంచి విజయవాడ నగరానికి వచ్చిన వలస కూలీలు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అవస్థలు పడ్డారు. వారి ఇబ్బందులపై ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. గుంటూరుకి చెందిన అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్... వలస కూలీలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈటీవీ కథనం చూసి స్పందించిన అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు లక్ష్మీనారాయణ... సంస్థ ప్రతినిధుల ద్వారా 85 కుటుంబాలకు మే 3 వరకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. బియ్యం, గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, నూనె అందించారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి కోల్పోయామని, తమ యజమాని పట్టించుకోకపోయినా దాతలు ఇచ్చే వాటితో కడుపునింపుకుంటున్నామని వలస కూలీలు చెబుతున్నారు. ఈటీవీకి, అమ్మ ఛారిటబుల్ ట్రస్టుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి