వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందంటూ.. ఆమె బంధువులు విజయవాడ సన్రైజ్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విస్సన్నపేటకు చెందిన శ్యామల రోడ్డు ప్రమాదంలో గాయపడింది. 5 రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం సన్రైజ్ హాస్పిటల్లో బంధువులు చేర్చారు. కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. కాసేపటికే ఆమె మృతి చెందింది. వెంటనే.. బంధువులు ఆందోళన చేపట్టారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి యాజమాన్యం స్పందించటం లేదంటూ ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదలేది లేదని నిరసనకు దిగారు.
ఇదీ చదవండి