Registrations: జగనన్న గృహ హక్కు పథకం కింద ఇప్పటివరకు 4.97 లక్షల డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు.. మంత్రుల ఉపసంఘానికి అధికారులు వివరించారు. సచివాలయంలో రీ-సర్వేతోపాటు జగనన్న గృహ హక్కు పథకం అమలు తీరుపై మంత్రుల ఉపసంఘం సమీక్షించింది. ఈ సందర్భంగా అధికారులు మంత్రులకు తాజా పరిస్థితి వివరించారు.
‘ఇప్పటివరకు 10 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. 2.83 లక్షల డాక్యుమెంట్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి అనుమతులు లభించాయి. వీటిని నిషిద్ధ జాబితా నుంచి సబ్ రిజిస్ట్రార్లు తప్పిస్తున్నారు’ అని పేర్కొన్నారు. చివరిగా మంత్రులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: