రియల్ ఎస్టేట్(real estate) రంగాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని.. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satyanarayana) తెలిపారు. క్రెడాయ్ ప్రాపర్టీ షో(CREDAI property show)..పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడుతోందని మంత్రి అన్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో.. 7వ క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
క్రెడాయ్ తరపున గతంలోనే ప్రముఖలు వచ్చి తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపారన్న మంత్రి.. కాలానికి అనుగుణంగా సమస్యలు వస్తుంటాయని అన్నారు. వాటిని సమన్వయంతో పరిష్కరిస్తామని తెలిపారు. త్వరలో క్రెడాయ్ తరపున ముఖ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. క్రెడాయి అంటే విశ్వసనీయతకు మారు పేరని.. బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి:
AP BJP: రాజధాని విషయంలో వైకాపా, తెదేపాలు విఫలం: సోము వీర్రాజు