ETV Bharat / city

"రక్షగా ఉందాం... స్వేచ్ఛగా విహరించేందుకు రెక్కలమవుదాం" - RAKSHA BANDHAN SPECIAL STORY

రక్షాబంధన్​... అన్నాతమ్ముళ్లు అక్కాచెల్లెళ్లకు జీవితాంతం రక్షణగా ఉంటామని కల్పించే భరోసా. తోబుట్టువులకు జీవితంలోని ప్రతి దశలో తోడుగా నిలుస్తామని కలిగించే నమ్మకం. మరి వారికి మీరిచ్చే భరోసా అండగా ఉంటోందా..అడ్డు తగులుతోందా?

RAKSHA BANDHAN SPECIAL STORY
author img

By

Published : Aug 15, 2019, 10:20 AM IST

రాఖీ అంటే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధం. సోదర ప్రేమకు సంకేతం. అక్కాచెల్లెళ్లు సోదరుల చేతికి రాఖీ కట్టి పది కాలాలపాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటారు. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత ఉంటుంది. ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. అనుబంధం, ఆసరా, అండ - ఇవేగా జీవితంలో కావల్సింది. కానీ ఎంతమంది ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఎంతమంది తోబుట్టువులకు అండగా నిలుస్తున్నారు.

రక్షాబంధన్ అంటే​... కేవలం మీరు మీ తోబుట్టువులకు అండగా నిలవడమే కాదు...వారు జీవితంలో సాధించాలనుకున్నదానికి అడ్డుపడకుండా ఉండటం కూడా. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఏదో సాధించాలనుకుంటుంది. కానీ... పెళ్లికి ముందు తల్లిదండ్రులు, తర్వాత భర్త చెప్పినట్లు నడుచుకోవడంతోనే సరిపోతోంది. కలలు కలలుగానే మిగిలిపోతాయి.

మీ జీవితంలో తారసపడే ప్రతి అమ్మాయి ఏదో ఒక దశలో తాను చేయాలనుకున్నది చేయలేని పరిస్థితులు ఎదుర్కొని ఉండవచ్చు. ఈ రక్షాబంధన్​కు మీరు ఒక ప్రమాణం చేయండి. మీకు ధైర్యం చెబుతూ నిత్యం మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకుంటూ మీ జీవితంలో అండగా నిలుస్తున్న ఆడవాళ్లకు మీరు అడ్డుకాకుండా చూసుకోండి. వారి కలలకు మీ వంతు సహకారం అందించండి.

ఆశయాల కోసం ఆకాశానికి ఎగరాలనుకుంటే రెక్కలుగా మారి వారికి ఆసరాగా నిలుస్తామని భరోసా కల్పించండి. అలసిపోయినప్పుడు... సేదతీరుస్తామనే నమ్మకం కల్పించండి. ఇది కేవలం మీ తోబుట్టువుల వద్దే ఆగకూడదు. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆడపిల్ల.. మీ భార్య, కూతురు, సహోద్యోగి ఇలా ప్రతి మహిళకు తాను అనుకున్నది సాధించే దిశలో దిక్సూచిలా మారండి కానీ అడ్డంకిగా కాదు.

రక్షాబంధన్​ అంటే తోబుట్టువులకు అండగా ఉండటమే కాదు... వారు సాధించాలనుకున్న వాటికి అడ్డుతగలకుండా ఉండడమూ అవసరమే! అందుకే... ఈ రక్షా బంధన్ నుంచి ప్రతి సోదురుడూ.. సోదరికి అండగా ఉంటూ.. వారు స్వేచ్ఛగా విహరించేందుకు రెక్కలు కావాలని ఆకాంక్షిద్దాం.

ఇదీ చూడండి: వింగ్​ కమాండర్​ అభినందన్​కు వీర్​ చక్ర అవార్డు

Intro:Jk_Tg_Mbnr_02_14_PANTA_NASTAM_PKG_3068847

Body:...

Conclusion:బైట్స్ :
1) కురువ రాజు ముస్లైపల్లి గ్రామ రైతు
2) కురువ చిన్న సువన్న ముస్లైపల్లి గ్రామ రైతు
3) ఆనంద్ దాదన్పల్లి గ్రామ రైతు
4) లక్ష్మణ్ గౌడ్ ముస్లైపల్లి గ్రామ రైతు
5) నర్సింలు ముస్లైపల్లి గ్రామ రైతు
6) శివరాజ్ ముస్లైపల్లి గ్రామ రైతు.

9959999069,మక్థల్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.