సాగులో అనేక ప్రయోగాలు చేసిన వీరు, వ్యవసాయాధారిత పరిశ్రమలపై దృష్టి సారించారు. మిరప రైతులు దోమ బెడద నివారణకు పసుపు జిగురు అట్టలు కొని... మిరప క్షేత్రంలో వేలాడ దీస్తారు. వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ గుర్తించి... ఆ పసుపు జిగురు అట్టలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. సంఘం సభ్యులంతా కలిసి పసుపు అట్టలు తయారు చేస్తూ అమ్ముతున్నారు.
బహిరంగ మార్కెట్లో ప్రముఖ కంపెనీల పసుపు జిగురు అట్ట రూ. 20-25 ఉండగా, రైతులు తయారు చేస్తున్న అట్ట కేవలం రూ. 10లకే అందిస్తున్నారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న రైతులకు మాత్రం ఉత్పత్తి ధరకే విక్రయిస్తారు. చుట్టుప్రక్కల ప్రాంతాల రైతులు అధిక సంఖ్యలో ఈ పసుపు జిగురు అట్టలు అమ్ముతున్నారు.
సాగులో కొత్త కొత్త ఆలోచనలతో వ్యవసాయాధారిత పరిశ్రమలపై దృష్టి సారించిన వీరి విజయం.. వ్యవసాయం లాభసాటి కాదు అనుకునేవారికి సమాధానంగా నిలుస్తోంది.