ETV Bharat / city

గుంతకల్లు రైల్వే కార్యాలయంలో అధికారుల సమావేశం

గుంతకల్లులో దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో రైల్వే అధికారుల సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించారు.

సమావేశం
author img

By

Published : May 10, 2019, 11:08 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో అధికారుల సమావేశమయ్యారు. డీఆర్ఎం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, టీసీలు, వివిధ స్టేషన్ల పోలీసు అధికారులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో ప్రయాణికులు ఎక్కువగా రైళ్లపై ఆధారపడి ప్రయాణిస్తుంటారని.. వారి భద్రత కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. రాత్రివేళల్లో, తెల్లవారుజామున జరిగే దొంగతనాలు, దోపిడీలను అరికట్టాలని జిల్లా ఎస్పీ, రైల్వే ఎస్పీ, డీఆర్ఎం సూచించారు. సాంకేతికతను వినియోగించుకుని దొంగలను సులభంగా కనిపెట్టవచ్చని తెలిపారు. వీటికి సంబంధించి ప్రత్యేక విధానాలను రూపొందించామన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను పాడు చేసి దోపిడీలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైళ్లల్లో టీసీలు.. పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో రైళ్లు స్టేషన్ బయట ఆగినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇది కూడా చదవండి.

లారీ, ఐచర్​ ఢీ... ఇద్దరి పరిస్థితి విషమం

Intro:ap_cdp_16_09_rtc_busstand_fine_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
అక్కడికి వెళ్లాలంటే కనీసం యాభై నుంచి వంద రూపాయలు జేబులో ఉండాలి. పొరపాటున వాహనాన్ని పార్కింగ్ చేస్తే చాలు క్షణాల్లో భద్రత సిబ్బంది పరుగులు తీస్తారు. వెంటనే ఈ చలన ద్వారా 50 లేదా 100 రూపాయలు జరిమానా విధిస్తారు. బస్సు ఎక్కించడానికి వచ్చాము అంటూ చెప్పినప్పటికీ వారు వినరు. జరిమానా కట్టి వెళ్లాల్సింది అంటూ హుకుం జారీ చేస్తారు. దీంతో ఆర్టీసీ పై ఉన్న నమ్మకం కూడా సన్నగిల్లుతుంది.
వాయిస్ ఓవర్:1
కడప ఆర్టీసీ బస్టాండ్ జరిమానా లకు నిలయంగా మారింది. ఎక్కడా లేని విధంగా బస్టాండ్ లో వాహనాలు పార్కింగ్ చేస్తే చాలు భద్రతా సిబ్బంది రెండో మాట మాట్లాడకుండా జరిమానా విధిస్తారు. ద్విచక్రవాహనానికి 50 రూపాయలు, నాలుగు చక్రాల వాహనానికి వంద రూపాయలు చొప్పున ఈ చలానా వేస్తారు. వాహనచోదకులు బస్సు ఎక్కించడానికి వచ్చానంటూ చెప్పినప్పటికీ వారు వినరు. జరిమానా కట్టి వెళ్లాల్సిందేనని వాహన చోదకుని పట్టుకుంటారు. ఎక్కడా లేని విధంగా కడపలో జరిమానాలు విధించడం తో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. కనీసం టికెట్ కోసం రెండు నిమిషాలు బస్టాండ్ లో కి పోయి వస్తే చాలు అప్పటికే భద్రతా సిబ్బంది ఈ చలానా పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. కనీసం వాహనచోదకులకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. వాహనచోదకులు ఏదైనా ప్రశ్నిస్తే వాహనాన్ని పెయిడ్ పార్కింగ్లో లో పెట్టుకోవాలి అని ఉచిత సలహా ఇస్తారు. పదినిమిషాల పనికి పెయిడ్ పార్కింగ్లో ఎందుకంటే వాహనచోదకులు ప్రశ్నిస్తారు. బస్టాండ్ లో వాహనాలను పార్కింగ్ చేస్తే చాలు ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తున్నారు. ప్రయాణికులు దేవుళ్ళు, ప్రయాణికులు సంస్థ కు కీలక అని చెప్పే అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా జరిమానాలు వేయడం ఏమిటంటే వాహనచోదకులు ప్రశ్నిస్తున్నారు.
byte: సుబ్బరాయుడు ప్రయాణికులు కడప.
byte: మనోజ్, ప్రయాణికుడు, కడప.
byte: నారాయణ యాదవ్, ప్రయాణికుడు, కడప.
వాయిస్ ఓవర్:
ఒక్కో జిల్లా రోజుకు పది వేల రూపాయలు జరిమానా వెయ్యాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో భద్రతా సిబ్బంది లక్ష్యాల కోసం జరిమానాలు విధిస్తున్నారు.

Body:ఆర్టీసీ బస్టాండ్ జరిమానాలు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.