ETV Bharat / city

Rahul Murder Case: రాహుల్​ కేసు.. రెండు రోజుల పోలీసు కస్టడీకి కోగంటి సత్యం - కోగంటి సత్యం కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ తాజా వార్తలు

పోలీస్‌ కస్టడీకి అనుమతించిన విజయవాడ కోర్టు

author img

By

Published : Sep 1, 2021, 7:28 PM IST

Updated : Sep 1, 2021, 8:27 PM IST

19:26 September 01

పోలీస్‌ కస్టడీకి అనుమతించిన విజయవాడ కోర్టు

విజయవాడలో దారుణ హత్యకు గురైన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడు కోగంటి సత్యం కస్టడీ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై ఇవాళ విచారణ జరగగా..రాహుల్‌ హత్య కేసులో కీలక వివరాలు రాబట్టాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం..సత్యంను 2 రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా జైలులో ఉన్న కోగంటి సత్యంను..గురువారం కస్టడీలోకి తీసుకోనున్నారు. 

రాహుల్ హత్య.. ఆ రోజు ఏం జరిగింది ?

విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం కలకలం సృష్టించింది. హతుడు.. పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) అని దర్యాప్తులో తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా గత నెల 19న  రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది.

తెల్లవారినా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, బోరున విలపించారు. ఈ కేసులో రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు వేగవంతం చేశారు.

ఛార్జర్ వైరుతో హత్య..

వ్యాపార లావాదేవీల కారణంగా రాహుల్‌ను కారులో ఉన్న ఛార్జర్ వైరుతో హత్య చేశారని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కారు వెనక సీట్లో కూర్చుని రాహుల్‌ను హత్య చేసినట్లు చెప్పారు.  

"వ్యాపారాల్లో కోరాడ విజయ్‌తో రాహుల్‌కు గొడవలు ఉన్నాయి. చాగర్ల గాయత్రి అనే మహిళతో కలిసి కోరాడ చిట్స్ వ్యాపారం చేసాడు. కోరాడ విజయ్‌.. ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో కోగంటి సత్యం ద్వారా తన వాటా కోసం రాహుల్‌పై ఒత్తిడి తెచ్చాడు. గతంలో గాయత్రి అనే మహిళ కుమార్తెకు దిల్లీ ఎయిమ్స్‌లో పీజీ సీటు ఇస్తానని రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నాడు. ఆ సీటు ఇప్పటివరకు ఇప్పించలేదు. ఈ వివాదం పరిష్కరించుకుందామని పిలిచి.. పథకం ప్రకారం చంపారు. హత్యకు ముందుకు కోగంటి సత్యం సమక్షంలో డాక్యుమెంట్లపై రాహుల్​తో సంతకాలు చేయించుకున్నారు. అనంతరం కోగంటి సత్యం చెప్పటంతో... పథకం ప్రకారం రాహుల్ సొంతకారులోనే ఛార్జర్ వైరుతో అతన్ని హత్య చేశారు. హత్య అనంతరం కోరాడకు రవికాంత్ అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చారు." - శ్రీనివాసులు, విజయవాడ సీపీ

ఇదీ చదవండి

DEADBODY IN CAR: రాహుల్​ది హత్యగా ప్రాథమిక నిర్ధారణ.. ఆధారాలు లభ్యం!

Last Updated : Sep 1, 2021, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.