ETV Bharat / city

జనసేనతో పొత్తుపై.. భాజపా కీలక వ్యాఖ్యలు - పురందేశ్వరి తాజా వార్తలు

రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని.. ఇలా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఉబిలో కొట్టుమిట్టాడుతోందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అప్పులు చేస్తోందని విమర్శించారు.

ఇలా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు
ఇలా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు
author img

By

Published : Jun 5, 2022, 4:15 PM IST

Updated : Jun 5, 2022, 4:23 PM IST

రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఉబిలో కొట్టుమిట్టాడుతోందని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అప్పులు చేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని.. ఇలా ఉంటే పెట్టుబడులు రావన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నామమన్న పురంధేశ్వరి.. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. మోదీ నాయకత్వంలో తమ పార్టీ 8 ఏళ్ల అధికారం పూర్తి చేసుకుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఉచిత రేషన్ అందించామన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తోందని వెల్లడించారు.

మరోవైపు జనసేన-భాజపా పొత్తుపై పురంధేశ్వరి మాట్లాడారు. తమ మధ్య పొత్తు కొనసాగుతోందన్నారు. కరోనా వేళ ప్రత్యక్షంగా కలవలేకపోయామని, ఇరుపార్టీల మధ్య సమన్వయ లోపం లేదని చెప్పుకొచ్చారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారని తెలిపారు. అటు.. ఆత్మకూరు ఉపఎన్నికపైనా స్పందించారు. ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టడంపై జనసేనతో చర్చించామని, ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో భాజపా అభ్యర్థి నిలబడతారని చెప్పారు.

అవకాశం ఇవ్వాలి : భాజపా - జనసేన కూటమికి ఒక అవకాశం ఇవ్వాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రజలను కోరారు. రాష్ట్రంలో కొత్త కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2024 ఎన్నికలకు భాజపా-జనసేన కలిసే వెళ్తాయన్న విష్ణువర్ధన్‌రెడ్డి.. తమ కూటమిలోకి రావాలంటే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వారానికి ఒక కేంద్రమంత్రి పర్యటిస్తారని చెప్పారు.

కలిస్తే గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో జనసేన ముందు ఇప్పుడు మూడు మార్గాలు ఉన్నాయని ప్రకటించారు. ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు లేదా భాజపాతో కలిసి వెళ్లడం.. లేదంటే తెదేపా, భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అని ప్రకటించారు. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. తెదేపా నాయకులకు ఒక్కటే చెబుతున్నా.. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును అనే బైబిల్‌ సూత్రాన్ని పాటించాలి. ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. తెదేపా అధినేత చంద్రబాబు వార్‌ వన్‌సైడ్‌ అయింది అంటున్నారు. గతంలో వన్‌సైడ్‌ లవ్‌, ఇప్పుడు వార్‌ వన్‌సైడ్‌ అంటున్నారు. తెదేపా వారు ఏ మాటపై నిలబడతారో చూసి ఆ తర్వాత మాట్లాడదాం. తగ్గాల్సినంత కాలం తగ్గాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాం. ఆ దిశగా వెళ్తే పొత్తులను ఆహ్వానిద్దాం. పొత్తుల విషయం ఒక్క జనసేన చేతుల్లోనే లేదు. మిగతా వారి చేతుల్లోనూ ఉంది. కొత్తతరం కోసం నిలబడాలని అనుకుంటున్నాం. ఏదో 25 కేజీల బియ్యం కాదు.. యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలి. భాజపా నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని నాతో ఎవ్వరూ చెప్పలేదు. జాతీయ నాయకులు చెబితే చెబుతాను. పేపర్లలో వచ్చే వాటి ఆధారంగా చెప్పలేను." అని పవన్ వ్యాఖ్యనించారు.

ఇవీ చదవండి

Last Updated : Jun 5, 2022, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.