ETV Bharat / city

Pulichintala: తెలంగాణ జెన్‌కోకు పులిచింతల ప్రాజెక్టు అధికారుల లేఖ - పులిచింతల ప్రాజెక్టు తాజా వార్తలు

పులిచింతల ప్రాజెక్టులో నీటిని తెలంగాణ జెన్​కో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించటంపై.. ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టులో నీటిని.. కరెంటు ఉత్పత్తి కోసం అనధికారికంగా వాడటం సరికాదంటూ.. తెలంగాణ జెన్​కోకు లేఖ రాశారు.

pulichinthala power issue
తెలంగాణ జెన్‌కోకు పులిచింతల ప్రాజెక్టు అధికారుల లేఖ
author img

By

Published : Jun 30, 2021, 9:04 PM IST

పులిచింతల ప్రాజెక్టులో నీటిని తెలంగాణ జెన్​కో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించటంపై.. ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీటిని కరెంటు ఉత్పత్తి కోసం అనధికారికంగా వాడటం సరికాదని తెలంగాణ జెన్​కోకు.. పులిచింతల ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని నిల్వ చేయకుండా.. విద్యుత్ ఉత్పత్తి పేరిట కిందకు వదిలివేయటం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 29 రాత్రి నుంచి తెలంగాణ జెన్​కో విద్యుదుత్పత్తి చేస్తోందని.. పులిచింతల అధికారులు చెబుతున్నారు.

పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.26 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 30వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. జలాశయం పూర్తిగా నిండకుండా విద్యుత్ ఉత్పత్తి చేయరు. ఒకవేళ కరెంటు ఉత్పత్తి చేయాలని భావించినా.. ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే.. విద్యుదుత్పత్తి చేయటం సరికాదని నీటిపారుదలశాఖ అధికారులు అంటున్నారు. తెలంగాణా జెన్​కో తరపున.. పులిచింతల ప్రాజెక్టులో 24మెగావాట్ల మేర విద్యుదుత్పత్తి చేస్తున్నారని అధికారులు తెలిపారు.

స్పందించిన తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి

"జలవిద్యుత్‌ ఆపమనే హక్కు ఎవరికీ లేదు. జూరాల, సాగర్‌, పులిచింతలలో విద్యుదుత్పత్తి తెలంగాణ హక్కు. ఎవరో ఆర్డరిస్తే వినాల్సిన అవసరం మాకు లేదు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపడం ఎవరితరం కాదు. కృష్ణా నదిలో మా వాటా ఎంతో మాకు తెలుసు. గతంలో చేసిన తప్పులనే చేస్తున్నారు"

- జగదీశ్‌రెడ్డి, తెలంగాణ మంత్రి.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.