శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌ల నుంచి భారీగా వరద నీరు రావడంతో... పులిచింతల డ్యామ్ మరోసారి పూర్తిస్థాయిలో నిండింది. శుక్రవారం రాత్రి నుంచి పులిచింతల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ముక్త్యాల, వేదాద్రి, రావిరాల వద్ద కృష్ణా నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది.
ఈ ఉదయానికి 3 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి నీటి విడుదల లక్ష క్యూసెక్కులకు తగ్గించారు. డ్యామ్‌లో నీటిమట్టం పూర్తిస్థాయిలో 45 టీఎంసీలు నిల్వ ఉండగా... ఎగువ నుంచి 70 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.
ఇదీ చదవండి: