విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికలకు మూడు వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు సీపీ బీ శ్రీనివాసులు తెలిపారు. 60 శాతానికి పైగా సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు గుర్తించామన్నారు. అతి సమస్యాత్మక ప్రాంంతాల్లో నిఘా పెంచనున్నామన్నారు. పోలింగ్ రోజున 100 పెట్రోలింగ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో లైసెన్స్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 199 ప్రాంతాల్లో పోలింగ్ జరగనుందని విజయవాడ సీపీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తెదేపా పురఎన్నికల బహిష్కరణ అంతా బూటకం: అంబటి