ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ పూర్తైంది. సంస్థలో 1600 మంది ఉద్యోగులు పదోన్నతులు పొందినట్లు ఆర్టీసీ వెల్లడించింది. 2013లో పదోన్నతులు పొంది ఇంకా సర్వీసులు క్రమబద్ధీకరణ కానీ 121 మందిని క్రమబద్ధీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో 52 మంది అధికారులకు పదోన్నతులు కల్పించినట్లు ఆర్టీసీ తెలిపింది. వీరిలో రీజినల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లు, డీఎంలు, ఈఈ, సీనియర్ మెడికల్ అధికారులు ఉన్నారు.
వీటితో పాటు సంస్థలో ఎస్ఆర్బీఎస్ (SRBS), ఎస్బీటీ (SBT) చెల్లింపులు ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ముందుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులకు చెల్లింపులు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
ఇదీ చదవండి