ETV Bharat / city

profeser sexuval harashment: విద్యార్థినిపై ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు.. విచారణకు ఆదేశం

profeser sexuval harashment: దంతవైద్య విద్య చదువుతున్న ఓ విద్యార్థినిని.. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లైంగికంగా వేధించాడని వచ్చిన ఆరోపణలపై.. కళాశాల డీఎంఈ విచారణకు ఆదేశించారు.

దంత వైద్య విద్యార్థినికి ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు

author img

By

Published : Jan 5, 2022, 4:07 PM IST

professor sexuval harassment : విజయవాడ దంత వైద్య కళాశాలలో విద్యార్థినిపై.. ఓ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై.. కళాశాలలో విచారణ ప్రారంభమైంది. బాధిత విద్యార్థిని మూడు రోజుల క్రితమే.. విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం.

అయితే.. విచారణ చేస్తామని కళాశాల ప్రిన్సిపల్‌ హామీ ఇవ్వడంతో ఆమె వెనుదిరినట్టు తెలుస్తోంది. అనంతరం ఈ ఘటనపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం దంతవైద్య కళాశాలలో ముగ్గురు వైద్యుల బృందంతో అంతర్గత విచారణ చేపట్టారు.

ఇందులో భాగంగా.. బాధితురాలితోపాటు పలువురు విద్యార్థినులను విచారించారు. ఈ ఘటనపై విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యుగంధర్‌ను సంప్రదించగా.. విద్యార్థిని ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, అంతర్గత విచారణ చేపట్టామని, డీఎంఈకి నివేదిక అందజేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

PERNI NANI COMMENTS ON RGV: సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.