ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుపై కమిటీ నివేదికలను తయారు చేయనుంది. ప్రతిపాదనలు సమర్పించిన సంస్థల చరిత్ర, ప్రతిపాదిత కోర్సులు, కరిక్యులమ్ వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: అన్లాక్-4: ఈ నెల 21 నుంచి విద్యాలయాలకు అనుమతి