ETV Bharat / city

ఆనందయ్య కరోనా మందు అశాస్త్రీయమైనది: హేతువాద సంఘం - ఏపీ హేతువాద సంఘం తాజా వార్తలు

ఆనందయ్య కరోనా మందుకు శాస్త్ర ప్రమాణం లేదని ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నె వెంకటసుబ్బయ్య ఆరోపించారు. అలాంటి అశాస్త్రీయమైన మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం ఏంటని ధ్వజమెత్తారు. ఈ మందుపై పునరాలోచన చేయాలని కోరారు.

AP Rationalist Society
ఏపీ హేతువాద సంఘం
author img

By

Published : Jun 7, 2021, 1:16 PM IST

ఆనందయ్య కరోనా మందు అశాస్త్రీయమైనదని ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నె వెంకటసుబ్బయ్య ఆరోపించారు. ప్రజాబలం ఉందని ప్రభుత్వం శాస్త్ర ప్రమాణం లేని వాటికి అనుమతి ఇస్తోందంటూ ధ్వజమెత్తారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒక మందును గుర్తించాలంటే అనేక పరిశోధనల అనంతరం ఇండియన్ మెడికల్ కౌన్సిల్, ఆయుష్ పరిశోధించాకే నిర్ణయిస్తారు. ఆనందయ్య ఇస్తున్న ముందుకు అవేమీ లేవన్నారు. శాస్త్రీయంగా రాజ్యాంగ సూత్రాల ప్రకారం పని చేస్తామని ప్రమాణం చేసి ఏ విధంగా అశాస్త్రీయమైన వాటికి అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై పునరాలోచించాలని.. ప్రజలందరికి కరోనా వాక్సిన్ త్వరగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఇదీ చదవండీ.. విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా రివర్స్ నిర్ణయాలు: అనగాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.