ETV Bharat / city

రాష్ట్రానికి పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధుల బృందం..జెన్‌కోకు ఇచ్చిన రుణ బకాయిలపై సీఎస్‌తో చర్చ ! - విద్యుత్ బకాయిలు న్యూస్

జెన్‌కోకు ఇచ్చిన రుణ బకాయిలపై సీఎస్‌తో చర్చించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ-PFC), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ-REC) ప్రతినిధుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. సీఎస్​ (CS) ను కలిసి బకాయిలపై సెటిల్‌మెంట్‌ చేసుకోనున్నారు.

రాష్ట్రానికి పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధుల బృందం

author img

By

Published : Nov 16, 2021, 10:27 PM IST

దిల్లీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ (REC) ప్రతినిధుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో ఐదుగురు ప్రతినిధులతో కూడిన బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ప్రతినిధుల బృందంలో మినిస్ట్రీస్ పవర్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, పీఎఫ్​సీ ఛైర్మన్, ఆర్.ఎస్ దిళ్లనీలతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. జెన్‌కోకు ఇచ్చిన రుణ బకాయిలపై సీఎస్‌తో (CS) ప్రతినిధులు చర్చించనున్నారు.

ఆర్‌ఈసీకి ఏపీ జెన్​కో (APGENCO) మెుత్తం రూ.11,157 కోట్ల మేర బకాయి పడగా..,అక్టోబరు 31 నాటికి రూ.405 కోట్లు బకాయి పడింది. పవర్‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.141 కోట్లు బకాయి పడింది. 90 రోజుల గడువు దాటడంతో జెన్‌కోను ఎన్‌పీఏగా ఆర్​ఈసీ ప్రకటించింది. ఇన్‌సాల్వన్సీ అండ్‌ బ్యాంకరప్ట్సీ కోడ్‌ వినియోగంపై ప్రతినిధులు బుధవారం సీఎస్​తో చర్చించే అవకాశం ఉంది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2 వేల కోట్ల మేర బకాయి పడగా..తక్షణం చెల్లించకుంటే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని పీఎఫ్​సీ గతంలోనే తేల్చి చెప్పింది. ఈ మేరకు సెటిల్‌మెంట్‌ కోసం పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు.

అప్పు వసూలు చేసుకోవటానికే వచ్చారు: పయ్యావుల

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు వసూలు చేసుకోటానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారులు దిల్లీ నుంచి వచ్చారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వేల కోట్ల అప్పులు చెల్లించకపోవటంతో వసూళ్ల కోసం వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల బకాయి పడిందని, ఆ సొమ్మును ప్రజల నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి

Payyavula: బిడ్డింగ్ లేకుండా 'సెకి' ఆఫర్​కు ఏకపక్ష అంగీకారమా..? పయ్యావుల లేఖాస్త్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.