రాష్ట్రంలో దేవాలయాల ఆస్తులు, భూములు, ఆదాయ వ్యయాలపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. హిందువుల ఆలయాలు, మందిరాలపై వరుస దాడులు జరుగుతున్నా...,ఇంతవరకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోలేకపోయారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. దీనికి ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేవాదాయశాఖకు మంత్రి వెల్లంపల్లి గ్రహణమని ఆయన విమర్శించారు.
నిరుపేదలను పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లే దివ్య దర్శనం పథకాన్ని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసిందో మంత్రి బహిరంగంగా ఓ ప్రకటన విడుదల చేయాలని కోరారు. అంతర్వేది ఘటనలో ఇంతవరకు ఎందుకు బాధ్యులను అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తరతరాలుగా ఉన్న సంప్రదాయం ప్రకారం రథం తయారీలో మత్స్యకారులను భాగస్వాములను చేయటం..,వారి ద్వారా నిర్వహణ కొనసాగించే విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలన్నారు.
ఇదీచదవండి
ఫిబ్రవరిలోగా అంతర్వేది రథాన్ని నిర్మిస్తాం: మంత్రి వెల్లంపల్లి