తెలంగాణలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లాయర్ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పుట్టా మధు అక్రమాలు ప్రశ్నించినందుకే నా బిడ్డలను చంపారని కిషన్‌రావు పిటిషన్లో ఆరోపించారు.
హత్యకేసు నిందితులను వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ.. ఇటీవలే మంథని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ డీసీపీ రవీందర్ మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతించిన కోర్టు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను వారంపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.