.
పింఛన్ల తొలగింపును నిరసిస్తూ విజయవాడలో ర్యాలీ - విజయవాడలో పింఛన్ దారుల ఆందోళన వార్తలు
పింఛన్ జాబితా నుంచి పేర్లు తొలగించారంటూ విజయవాడ పటమట మీసేవ కేంద్రం వద్ద బాధితులు ఆందోళన చేశారు. తెలుగుదేశం నేత గద్దె రామ్మోహన్‌రావు ఆధ్యర్యంలో ర్యాలీ చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పెన్షన్ పొందుతున్న తమ పేరును అకారణంగా తొలగించడమేంటని వృద్ధులు, దివ్యాంగులు ప్రశ్నించారు. సమస్యను పరిష్కరిస్తామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలో ర్యాలీ
.