సచివాలయ పోస్టుల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో విద్యార్థులు ధర్నాకు దిగారు. సచివాలయ పోస్టుల ప్రశ్నపత్రాల్లో లీకేజీ జరిగిందని అభ్యర్థులు, నిరుద్యోగులు గందరగోళంలో ఉన్నారని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర తెలిపారు. వారి అనుమానాలు, అపోహలను నివృత్తి చేసే విధంగా ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అనితమ్మకు మొదటి ర్యాంకు, ఏఎస్ఓగా పనిచేస్తున్న మల్లికార్జున్ రెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డిలకు ర్యాంకులు రావడం అపోహలు సృష్టించిందన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురికి ర్యాంకులు రావడంపై నిరుద్యోగులు తీవ్ర గందరగోళంలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే న్యాయ విచారణ జరిపి... కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :