ETV Bharat / city

ప్రకృతి విపత్తు కరోనా...మానవ విపత్తు వైకాపా: శైలజానాథ్ - వైసీపీపై శైలజానాథ్ కామెంట్స్

కేంద్రమే కరోనా వ్యాధిని ఓ మహమ్మారిగా ప్రకటించినా.. రాష్ట్రం ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కరోనా ప్రభావాన్ని తక్కువగా చూపటం తగదని ఆయన హితవు పలికారు. ఎన్నికల పేరుతో ప్రజారోగ్యంతో ఆటలొద్దని సూచించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఏకగ్రీవం అని ప్రకటించిన స్థానాల్లోనూ పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్నారు.

pcc chief sailajanath
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
author img

By

Published : Mar 16, 2020, 10:04 PM IST

పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న శైలజానాథ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉంటే.. ఆ మహమ్మారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన ఆయన... జాతీయ విపత్తుగా ఉన్న కరోనా ప్రభావాన్ని ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందంటూ మండిపడ్డారు. కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేయడం కాదని, పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా అరాచకాలు సృష్టించిందని ఆరోపించారు. ఇప్పటివరకు వైకాపా తరఫున ఏకగ్రీవమైన అన్ని స్థానాలను పరిశీలించి వాటిపై న్యాయవిచారణ చేయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. చాలాచోట్ల పోలీసులు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై పోటీచేసిన అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు వెనక్కి తీసుకున్న కేసులను కూడా పరిశీలించాలన్నారు. పారాసిటమాల్​తో కరోనా నయం అయితే చైనాలో వేల మంది ఎందుకు మరణించారో సీఎం సమాధానమివ్వాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని ఆయన హితవు పలికారు. ఏపీలో ప్రకృతి విపత్తుగా కరోనా వస్తే... మానవ విపత్తుగా వైకాపా అరాచకాలు ఉన్నాయన్నారు.

ఇదీ చదవండి : సీఎం.. ఎన్నికల కమిషన్​ను బెదిరిస్తున్నారు : కన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.