PAWAN ON DGP TRANSFER: డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. డీజీపీ ఆకస్మిక బదిలీకి గల కారణాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ర్యాలీ విజయవంతం వల్లే చేశారా.. లేక ఉద్యోగులను భయపెట్టేందుకు బదిలీ చేశారా అని నిలదీశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీతో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఘటన గుర్తొస్తోందన్నారు.
-
శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/YjGpkBDbiN
— JanaSena Party (@JanaSenaParty) February 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/YjGpkBDbiN
— JanaSena Party (@JanaSenaParty) February 15, 2022శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/YjGpkBDbiN
— JanaSena Party (@JanaSenaParty) February 15, 2022
Ap Dgp Gautam Sawang Transfer: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం, విజయవాడ పోలీస్‌కమిషనర్‌గానూ రాజేంద్రనాథ్‌రెడ్డి పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగానూ ఆయన సేవలందించారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతమ్ సవాంగ్‌ను సర్కార్ ఆదేశించింది. 2023 జులై వరకు సవాంగ్‌కు పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి