ETV Bharat / city

కేంద్ర ప్రభుత్వం తరహాలో.. వైకాపా సర్కార్​ పన్నులు తగ్గించాలి: పవన్​కల్యాణ్​ - janasena news

రోజురోజుకు పెరిగిపోతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు.. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్​ సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమన్నారు జనసేన అధినేత పవన్​కల్యాణ్​. రోడ్డు సెస్ పేరుతో.. వైకాపా ప్రభుత్వం ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదని ధ్వజమెత్తారు. కనీసం పెట్రోలు, డీజిల్​పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని డిమాండ్‌ చేశారు.

pawan kalyan
pawan kalyan
author img

By

Published : May 22, 2022, 4:29 PM IST

Pawan on Petrol price: పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్ర మార్గాన్ని రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరించాలని సూచించారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని తెలిపారు. పెట్రోలు 9.50 పైసలు, డీజిల్ రూ.7 వరకు తగ్గడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉండడం అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు కొంత స్వాంతన కలిగిస్తుందని పేర్కొన్నారు.

పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై 200 తగ్గించడం పేదవారికి ఆర్థికంగా మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ కొనుగోలుపై రోడ్డు సెస్ పేరుతో.. వైకాపా ప్రభుత్వం ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదని ధ్వజమెత్తారు. కనీసం పెట్రోలు, డీజిల్ పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని డిమాండ్‌ చేశారు.

petrol price news: పెట్రో భారం నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కల్పించడంలో కేంద్రం బాటలోనే పయనిస్తున్నాయి పలు రాష్ట్రాలు. లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్​ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్​పై 2.41 రూపాయలు, డీజిల్​పై 1.36 రూపాయలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్​ కూడా పన్నును తగ్గించింది. పెట్రోల్​పై 2.48 రూపాయలు, డీజిల్​పై 1,36 మేర తగ్గించినట్లు ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్​ ట్విట్టర్​లో తెలిపారు.

మేం తగ్గించలేం: పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్​ టి. రాజన్​ స్పందించారు. అది అసంపూర్ణమేనని విమర్శించారు. రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయని చూడటం.. న్యాయం కాదు, సమంజసమూ కాదని అన్నారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని కోరని కేంద్రం.. ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. పెట్రోల్​, డీజిల్​పై పన్నుల తగ్గింపును పరిశీలిస్తామని అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై.

Petrol Excise Duty: దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్‌, డీజిల్‌, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్‌, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది. గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది.

గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది. అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ఇదే తరహాలో తమ వంతు పన్ను తగ్గించాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు స్పందించకపోగా.. పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పట్లో విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.