మున్సిపల్ ఎన్నికల్లో గుండె ధైర్యం ఉన్న మహిళలు, యువకులు బలంగా నిలబడి విజయం సాధించారని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన పార్టీ తరఫున కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ తరఫున గెలుపొందిన, పోటీ చేసిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలను అభ్యర్థుల ద్వారా తెలుసుకున్నారు పవన్. ఎన్నో ఒత్తిళ్లు, దౌర్జన్యపూరిత వాతావరణంలో గుండె ధైర్యం ఉన్న ఆడపడుచులు, యువకులతో కూడిన బలమైన సమూహం నిలబడి విజయం సాధించిందని పవన్ అన్నారు.
పార్టీ నిర్మాణం అనేది ఓ సాహసోపేతమైన చర్య అని పవన్ అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాలు బాగుండాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లడం ఎంతో కష్టమని వివరించారు. అధికారంలో ఉన్న వారు డబ్బులిచ్చి సమాజాన్ని పాడు చేస్తుంటే నిజాయితీపరులు నలిగిపోతున్నారన్నారు. నాయకులు చూపిన స్ఫూర్తితో పదింతల విశ్వాసంతో తాను పార్టీని ముందుకు తీసుకువెళ్తానని జనసేనాని స్పష్టం చేశారు.
-
దౌర్జన్యాలు… దాష్టీకాల నడుమ జనసేన అభ్యర్థుల పోరాటం గొప్పది pic.twitter.com/VhFkvpBLAF
— JanaSena Party (@JanaSenaParty) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">దౌర్జన్యాలు… దాష్టీకాల నడుమ జనసేన అభ్యర్థుల పోరాటం గొప్పది pic.twitter.com/VhFkvpBLAF
— JanaSena Party (@JanaSenaParty) March 16, 2021దౌర్జన్యాలు… దాష్టీకాల నడుమ జనసేన అభ్యర్థుల పోరాటం గొప్పది pic.twitter.com/VhFkvpBLAF
— JanaSena Party (@JanaSenaParty) March 16, 2021
ఇదీ చదవండి: తిరుపతి ఉపఎన్నిక: ఏప్రిల్ 17న ఎన్నికలు.. మే 2న ఫలితాలు