ETV Bharat / city

వాళ్ల పరిస్థితి దయానీయం... ఆదుకోండి: జనసేన అధినేత - వాళ్ల పరిస్థితి దయానీయం... ఆదుకోండి: జనసేన అధినేత

కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో తాళ్లప్రొద్దుటూరు గ్రామస్థులను కాపాడాలని అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. వాళ్ల పరిస్థితి దయానీయంగా ఉందని... వరద ఎప్పుడు ముంచేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

pawan kalyan  appealed to protect the villagers of Talla Proddatur in kadapa district
వాళ్ల పరిస్థితి దయానీయం... ఆదుకోండి: జనసేన అధినేత
author img

By

Published : Sep 26, 2020, 9:07 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్లప్రొద్దుటూరు గ్రామస్థులను వరద ముప్పు నుంచి కాపాడాలని... ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. తమ కాలనీలోకి రిజర్వాయర్ నీరు వస్తోందని, తమను కాపాడాలని స్థానికులు చేసిన విజ్ఞప్తిని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.

క్షేత్రస్థాయి పరిశీలన...

కాలనీవాసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా... జనసేన స్థానిక నాయకులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి చూశారని... అక్కడి పరిస్థితి దయనీయంగా ఉందని తనకు వివరించారన్నారు. తమకు ఇంకా పరిహారం అందకపోవడం వల్ల తాము అక్కడే ఉండిపోయామని కాలనీవాసులు చెబుతున్నారని... వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత వారికి లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు. వృద్దులు, చంటి పిల్లలు, చివరికి గర్భిణీలు ఉన్నారని... వరద ఎప్పుడు ముంచేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా అమానుషమన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

పరిస్థితి ఊహించలేం

ప్రస్తుతం రిజర్వాయర్​లో 15 టీఎంసీలకు నీరు చేరుకుంటేనే ఎస్సీ కాలనీలోకి వరద నీరు వచ్చిందని... పూర్తి స్థాయికి చేరితే పరిస్థితి ఊహించడం కష్టంగా ఉందని పవన్ అన్నారు. అందువల్ల చివరి కుటుంబం సైతం గ్రామాన్ని విడిచే వరకు వారి భద్రతకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిజర్వాయర్​కు నీటి విడుదలపై సంయమనం పాటించాలన్నారు. నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్‌ కోరారు. వారితో తక్షణమే సంప్రదింపులు జరిపి వారి అభీష్టాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.