Chalo Vijayawada: పంచాయతీరాజ్ శాఖ పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్స్ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నారు. పోలీసుల దృష్టిని మరల్చి తమ డిమాండ్ల సాధనకై.. కొందరు గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్స్ విజయవాడ చేరుకున్నారు. అక్రమ నిర్బంధాలు, పోలీసుల చర్యలతో తమను ఆపలేరని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు.
కొవిడ్ సమయంలో పంచాయితీ కార్మికులు పనిచేసి ప్రాణాలు కోల్పోయారని.. వారికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కనీసం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. రూ.10 వేలకు పైగా జీతం రావటం లేదని, కొన్ని నెలలుగా ఆ జీతం కూడా పెండింగ్లో ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: ప్యాకేజీ పెంచుకోవడానికే పవన్ కల్యాణ్ సభ: మంత్రి వెల్లంపల్లి