ETV Bharat / city

'ప్రతిపక్ష నేతలు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు'

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అలుపెరగకుండా పోరాడుతుంటే...ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని విమర్శించారు. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లపై తెదేపా, భాజపా నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
author img

By

Published : Apr 21, 2020, 9:42 AM IST

ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని

కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లపై తెదేపా, భాజపా నేతలు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని విమర్శించారు. ఐసీఎంఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కిట్లను కొనుగోలు చేస్తే కన్నా లక్ష్మీనారాయణ...దానిపై ఎందుకు నోరు మెదపలేదని మంత్రి ప్రశ్నించారు. ఆ ధర కన్నా 60 రూపాయలు తక్కువకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు.. ఆ సంస్థ సూచించిన ధరకంటే తక్కువకే కిట్లు కొనుగోలు చేశామని తెలిపారు.

లేనిపోని ఆరోపణలు చేస్తూ...ప్రతిపక్ష నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని ..ప్రతి చర్య పారదర్శకంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కొరియా నుంచి కిట్లను కొనుగోలు చేసే ముందే.. ఇతర రాష్ట్రాలు తక్కువ ధరకు కొనుగోలు చేశాయా ? లేదా ? అని వాకబు చేసినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాతే రెండు లక్షల కిట్లను 730 రూపాయల చొప్పున కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ఇతర రాష్ట్రాలు ఆర్డర్ ఇచ్చినా మొదటిగా ఈ కిట్లు ఏపీకి మాత్రమే వచ్చాయని మంత్రి తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాల్లో భాగస్వాములు కావొద్దని కన్నాకు మంత్రి హితవు పలికారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.