ETV Bharat / city

Online Fraud: ఓటీపీ చెప్పకపోయినా.. ఖాతా నుంచి డబ్బులు మాయం

Cyber crime: ఆన్‌లైన్‌ షాపింగ్ ఇటీవల బాగా పెరిగింది... కొవిడ్‌ తర్వాత ఈ ధోరణి మరింత ఎక్కువైంది... చిన్న వస్తువుల నుంచి విలువైన వస్తువుల వరకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడం సాధారణమైపోయింది... డిస్కౌంట్ల కోసం వెబ్‌సైట్లను వెతుకుతున్నారు... అవసరం ఉన్నా, లేకపోయినా కొనేవారి సంఖ్య కూడా తక్కువేం కాదు... ఇలాంటి వాళ్లు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే... కష్టార్జితం సైబర్‌ దొంగలపాలు కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Cyber crime
విజయవాడలో అన్​లైన్​ మోసం
author img

By

Published : Feb 28, 2022, 12:17 PM IST

విజయవాడలో అన్​లైన్​ మోసం

Cyber crime: ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగినట్లే.. సైబర్ నేరాలు కూడా పెరిగాయి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల నుంచి డెబిట్, క్రెడిట్‌ కార్డుల డేటా చోరీ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు... సులువుగా డబ్బులు నొక్కేస్తున్నారు. కాసుల కక్కుర్తితో కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు వినియోగదారుల డేటాను సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తుంటాయి. ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌ దొంగలు రెచ్చిపోతున్నారు. అలాగే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో మాల్‌వేర్‌ ప్రవేశపెట్టి... లావాదేవీలు జరిపే సమయంలో కార్డు వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నా చాలామంది వినియోగదారులు అప్రమత్తం కావడం లేదని పోలీసులు, సైబర్ నిపుణులు చెబుతున్నారు.

Cyber crime: విజయవాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడికి... ఏడు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇటీవల తన కార్డుల నుంచి 2 లక్షల 47 వేల రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పకపోయినా... లావాదేవీలు ఎలా పూర్తయ్యాయో ఆ యువకుడికి అర్థం కాలేదు. ఆ యువకుడి నుంచి ఫిర్యాదు అందుకుని విచారణ చేసిన పోలీసులు... తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో లావాదేవీలు జరిగినట్లు నిర్ధరించారు. అమెజాన్‌ ఓచర్లను కొనుగోలు చేసిన నిందితులు, వాటిని తమ అవసరాలకు వాడినట్లు దర్యాప్తులో తేల్చారు. అలాగే విజయవాడకు చెందిన ఓ బ్యాంకు అధికారి క్రెడిట్‌ కార్డు నుంచి 2 లక్షల 53 వేల రూపాయల షాపింగ్‌ చేసినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. ఆన్‌లైన్‌ సైట్‌ ద్వారా వివిధ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. విదేశాల్లో ఉండే నిందితులు ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది.

"చాలాసార్లు గూగుల్​, యూట్యూబ్​లలో ఫేక్​ ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిలో ఎక్కువ ధర కలిగిన వస్తువులు తక్కువ ధరకు వస్తాయని చెబుతుంటారు. నకిలీ యాంటీవైరస్​ ప్రకటనలు కూడా వస్తున్నాయి. అవన్నీ నమ్మి మీరు వాటిని సబ్​స్ర్కైబ్​ చేసి.. మీ క్రెడిట్​ కార్డు నంబరు నమోదు చేస్తే డబ్బులు పోయినట్టే. ఆన్​లైన్​లో నగదు బదిలీలు చేయడానికి ఓటీపీ అవసరం. ఇది ఆర్బీఐ సూచనలమేరుకు వచ్చింది. కేవలం భారత్​లో మాత్రమే ఉంది. కొన్ని దేశాల్లో ఈ ఓటీపీ అవసరం లేదు. మీ క్రెడిట్​ కార్డు​ నెంబర్​, సీవీవీ నెంబర్​, ఎక్స్పైరీ తేదీ ఉంటే చాలు. ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడానికి గానీ, వస్తువులు కొనుగోలు చేయడానికి గానీ ఉపయోగపడుతుంది." -సాయిసతీష్​, సైబర్​ సెక్యూరిటీ నిపుణులు

Cyber crime: ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని... సురక్షితం కాని వెబ్‌సైట్ల జోలికి పోవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

Rowdy Sheeter Murder: విజయవాడ శివారులో రౌడీషీటర్ అనుమానస్పద మృతి.. బ్లేడ్ బ్యాచ్​ పనేనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.