ETV Bharat / city

Shobhayatra: హైదరాబాద్​లో.. వైభవంగా శ్రీరామ శోభాయాత్ర - Hyderabad Sri Rama Shobhayatra

Sri Rama Shobhayatra: హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగింది. కరోనా వల్ల రెండేళ్లుగా నిర్వహించని శోభాయాత్రను ఈసారి ఘనంగా జరిపించారు. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అట్టహసంగా శోభాయాత్రను నిర్వహించారు.

భాగ్యనగరంలో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర
భాగ్యనగరంలో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర
author img

By

Published : Apr 10, 2022, 9:45 PM IST

శ్రీరామ శోభా యాత్ర
శ్రీరామ శోభా యాత్ర

Sri Rama Shobhayatra: హైదరాబాద్​లో భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగింది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు యాత్ర సాగింది. ధూల్‌పేట, జాలీ హనుమాన్, చుడీబజార్ మీదుగా సాగిన యాత్ర.. రాత్రి 8 గంటలకు ముగిసింది. రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించారు. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్లు శ్రీరామ శోభాయాత్ర నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల అట్టహాసంగా శోభాయాత్రను నిర్వహించారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించి... సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.

శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు
శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు

ట్రాఫిక్ ఆంక్షలు అమలు: శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శోభాయాత్ర సమయంలో ఆయా రహదారుల మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రించారు. వాహనాలను దారి మళ్లించి ఇతర రహదారుల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆంక్షలు విధించారు. బోయగూడ కమాన్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ చత్రి, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్​లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంది.

మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేత: హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: వాడవాడలా వైభవంగా సీతారాముల పెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.