మీరు మటన్ కొనుగోలు చేస్తున్నారా... ? జర జాగ్రత్త . డబ్బు కోసం నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తూ కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడ గొల్లపాలెం గట్టులో బయటపడిన ఉదంతమే నిదర్శనం. విజయవాడ గొల్లపాలెంగట్టులో సాంబశివరావు, సాయి అనే ఇద్దరు అన్నదమ్ములు మటన్, చికెన్ దుకాణాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అయితే నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారని, నగరంలోని హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నారని నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులకు సమాచారం అందింది.
తనిఖీలో నివ్వెరపోయే నిజాలు..
దీంతో ఇవాళ తెల్లవారుజామున నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రవిచంద్ర.. సిబ్బందితో ఆయా దుకాణాలపై నిఘా పెట్టారు. కబేళాకు వెళ్లకుండా, జీవాలకు ఆరోగ్య పరీక్షలు చేయకుండా ఎలాంటి అనుమతి ముద్ర లేకుండా అనధికారికంగా దుకాణంలోనే వాళ్లు చూస్తుండగానే జీవాలను కోస్తున్నారు. వెంటనే ఆ దుకాణాలపై దాడి చేశారు. సాంబశివరావు, సాయి దుకాణాలలోని ఫ్రిజ్‌లో సుమారుగా 250 కేజీలకు పైగా కుళ్లిపోయి, పురుగులు పట్టి మాసంపై సంచరిసున్న వైనం బయటపడింది . 65కు పైగా మేక, గొరెల తలకాయలు, కాళ్లు ఫ్రిజ్‌లో లభించాయి. అవి కూడా తీవ్ర దుర్వాసన వెలువడుతున్నాయి. సుమారు 150 కిలోలకు పైగా మాంసం మొత్తాన్ని బ్లీచింగ్ పౌడరు చల్లి ట్రాక్టర్లో డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు డా. రవిచంద్ర తెలిపారు. ఆ దుకాణాదారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు.
ముందుగానే కోసి...
ఆనారోగ్యంగా ఉన్న మేకలు, గొర్రెలు, యాక్సిడెంట్లో దెబ్బతిని గాయాలతో బాధపడుతున్న వాటిని పరిసర ప్రాంతాల్లో అతి తక్కువ వరకు కొనుగోలు చేస్తారని విచారణలో వెల్లడైంది. వాటిని ముందుగానే కోసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతున్నారు. ఆదివారం కావడాన్ని ఆసరాగా తీసుకుని ఆ మాంసాన్ని హోటళ్లు, ప్రజలకు అధిక ధరకు విక్రయిస్తున్నారని మున్సిపల్ అధికారులు గుర్తించారు.
కోన్నేళ్లుగా ఇదే తీరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తూ... రూ. లక్షల సొమ్ము సంపాదించారని స్థానికులు చెబుతున్నారు. ఈ తరహా దందా చాలా రోజులుగా కొనసాగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ట్రంప్‌ను తలుచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్: పట్టాభి