విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో నిలిపి ఉంచిన చెత్త వాహనాలను అధికారులు తొలగించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇంజనీరింగ్ పనుల కోసం గ్రౌండ్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. పనులు పూర్తి అయిన క్రీడాకారులకు అప్పగించలేదు. ఈ సమస్యపై నిన్న "మైదానంలో చెత్త వాహనాలు" అనే కథనాన్ని ఈటీవీ భారత్ ప్రచురించింది. దీనిపై స్పందించిన నగర కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ ఆ వాహనాల్ని పూర్తిగా తీసి వేయించారు. అంతేకాకుండా క్రీడాకారుల రన్నింగ్ ట్రాక్ సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటినుంచి కేవలం క్రీడాకారుల ప్రాక్టిస్ కోసమే మైదానాన్ని వాడుతామని అధికారులు చెప్పారు. ఈటీవీ కథనానికి అధికారులు స్పందించటంపై రాష్ట్ర, జిల్లా క్రీడా సంఘాల నాయకులు స్వాగతించారు. ఇంజనీరింగ్ పనులు అయిన వెంటనే, క్రీడాకారులను మైదానంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ.. అధికారుల ఆధీనంలోనే మైదానం..క్రీడాకారులకు తప్పని తిప్పలు