ETV Bharat / city

'ఓడీఐసీ కేంద్రం.. డ్రగ్స్​ బానిస యువతకు బాసట' - krishna district collector intiaz news

డ్రగ్స్​కు బానిసలుగా మారుతున్న యువకులను సక్రమ మార్గంలో నడిపేందుకు ప్రభుత్వం ఓడీఐసీ పేరుతో ఓ ప్రాజెక్ట్​ను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ముందుగా రెండు జిల్లాల్లో ఓడీఐసీ కేంద్రాలను ప్రారంభించనుంది.

డ్రగ్స్​ బానిస యువతకు బాసటగా ఓడీఐసీ కేంద్రం
author img

By

Published : Oct 31, 2019, 12:15 PM IST

యువకులు మత్తుకు బానిసలవుతున్నారనీ.. చిన్న వయస్సులోనే డ్రగ్స్​కు అలవాటుపడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని సక్రమ మార్గంలో నడిపేందుకు ప్రభుత్వం ఓడీఐసీ పేరుతో ఓ ప్రాజెక్ట్​ను చేపట్టింది. కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ముందుగా రెండు జిల్లాల్లో ఓడీఐసీ కేంద్రాలను ప్రారంభించనుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతకు వైద్య సేవలతో పాటు విద్యను అందించే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడలో సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ ,హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఓడీఐసీ కేంద్రం ద్వారా ఒక ప్రాంతంలో ఎంతమంది డ్రగ్స్ సేవిస్తున్నారో గుర్తించి వారికి కౌన్సిలింగ్, చికిత్స చేసి పునరావాసం కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చదవండి:

'ఇసుక కొరతపై పోరాటానికి భాజపా సంఘీభావం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.