NTR Birth Anniversary: ఎన్ఆర్ఐ తెదేపా ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను.. లండన్, కువైట్, మస్కట్ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెదేపా శ్రేణులందరూ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అన్ని నగరాల నుంచి మహానాడు వేదికకు చేరుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, 2024 లో తెదేపా తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని తీర్మానాలు చేశారు.
ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు జూమ్ కాల్ ద్వారా హాజరై.. పార్టీ పటిష్టానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తారకరాముడికి నివాళులర్పిస్తూ మస్కట్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఇదీ చదవండి: