జిల్లాల పునర్వ్యస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. కడప జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్‌గా పులివెందులను ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. జమ్మలమడుగు, కడప రెవెన్యూ డివిజన్లలోని 8 మండలాలను వేరు చేసి కొత్తగా పులివెందుల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. పులివెందుల రెవెన్యూ డివిజన్‌తో కడప జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య నాలుగుకు పెరిగింది.
మరోవైపు కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఉయ్యూరు రెవెన్యూ డివిజన్లో పామర్రు మండలాన్ని, మచిలీపట్నంలో ఘంటసాల మండలాన్ని కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. అటు చిత్తూరు జిల్లాలో నగరి రెవెన్యూ డివిజన్లోని రెండు మండలాలను చిత్తూరు రెవన్యూ డివిజన్‌లోకి మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. నగరిలోని శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం మండలాలను చిత్తూరు రెవన్యూ డివిజన్‌కు మార్పు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
- కొత్తపేట రెవెన్యూ డివిజన్లోని మండలాలు: ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి
- పులివెందుల రెవెన్యూ డివిజన్లోని మండలాలు: సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వెంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె
ఇదీ చదవండి: నన్నలా అంటే.. సీఎం జగన్‌ను ఇలా అంటాం: పవన్