ETV Bharat / city

అత్యవసర సేవలు ఆగాయి.. రోగుల ప్రాణాలు పోతున్నాయి! - vijayawada hospitals latest news

జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర సేవలను నిలిపివేశారు. కొవిడ్​ పరీక్షలు చేయించుకున్నాకే వైద్యం అందిస్తామని షరతులు పెడుతున్నారు. అత్యవసర వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు. దీంతో సకాలంలో అందాల్సి వైద్యం కాస్త అందక రోగి గుండె ఆగిపోతోంది.

no treatment in government hospital
ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలు బంద్‌
author img

By

Published : Jul 20, 2020, 7:00 PM IST

కృష్ణా జిల్లా మండవల్లి మండలం లోకుమూడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల గుండెపోటు వచ్చింది. విజయవాడలో సుమారు పది ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లినా చికిత్సకు నిరాకరించారు. కరోనా పరీక్ష చేయించుకోవాలని.. ఫలితం నెగిటివ్‌గా వస్తేనే చికిత్స చేస్తామని ఓ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రోగి నుంచి నమూనాలు తీసుకుని ఫలితాలకు రెండు రోజులు పడుతుందని.. తరవాత రావాలని తెలిపారు. ఇంటికి తీసుకువచ్చిన రెండో రోజే రోగి మరణించాడు. దహన సంస్కారాలు పూర్తయ్యాక కరోనా వ్యాధి లేదని ఫలితం వచ్చింది.

కైకలూరుకు చెందిన మరో వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా.. ఏలూరు, విజయవాడ, గుడివాడ, గుంటూరు ప్రాంతాల్లో ఎన్నో ఆసుపత్రులకు కుటుంబ సభ్యులు తిప్పారు. ఎక్కడా చేర్చుకోకపోవడం వల్ల ఇంటికి తీసుకువెళ్లారు. వ్యాధి ముదిరినందున అతను మృతి చెందాడు. మృతికి మూడు రోజుల ముందు పరీక్ష చేయించుకోగా కరోనా లేదని తేలింది. ఈలోపే ప్రాణాలు పోవడం వల్ల ఆ కుటుంబానికి అంతులేని శోకం మిగిలింది.

కొవిడ్‌-19 నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అత్యాధునిక సదుపాయాలున్న అన్ని ఆసుపత్రుల్లోనూ అత్యవసర సేవలను నిలిపివేశారు. కరోనా మహమ్మారితో సంబంధం లేకుండానే నిత్యం ఎంతో మంది వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా రాకకు ముందు పల్లె, పట్నమన్న భేదం లేకుండా ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడేవి. కొవిడ్‌-19 ప్రవేశంతో పరిస్థితులు భిన్నంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించే దయనీయ స్థితి నెలకొంది. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని, నెగిటివ్‌ వస్తేనే వైద్యం అందిస్తామని షరతులు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో చికిత్స అందక రోగి ఊపిరి ఆగిపోతోంది. ఇలాంటి అమానవీయ ఘటనలు జిల్లాలో అనేకచోట్ల చోటు చేసుకుంటున్నాయి.

ప్రాణాపాయ స్థితిలోనూ..

జ్వరం, దగ్గు, జలుబు, తుమ్ములు వంటివి సాధారణ పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశమున్నా ప్రస్తుతం కరోనా భయంతో బాధితులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ లక్షణాల్లో కొన్ని సహజంగా వచ్చే అవకాశముందని తెలిసినా ప్రైవేటు ఆసుపత్రులు చికిత్సకు నిరాకరిస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలోనూ చికిత్స చేయడానికి ససేమిరా అనడం వల్ల సాధారణ రోగులు పరిస్థితి దయనీయంగా మారింది. గుండె, మెదడు, కిడ్నీ, వెన్ను, నరాలకు సంబంధించిన వ్యాధులకు స్థానికంగా వైద్యం అందదు. ఆర్థిక భారాన్ని లెక్కజేయకుండా పెద్ద ఆసుపత్రులకు కుటుంబ సభ్యులు తరలిస్తున్నా.. కనీసం గేటు దాటే పరిస్థితి ఉండడం లేదు. కుటుంబంలోని సభ్యులు కళ్లముందే ప్రాణాలను కోల్పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండాల్సిన స్థితి ఏర్పడింది.

చికిత్స అందించకపోతే చర్యలు

కొవిడ్‌-19 పేరుతో అత్యవసర చికిత్సలను నిలుపుదల చేస్తే ఆయా ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అలాంటి ఆసుపత్రుల సమాచారాన్ని తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని ఆలోచిస్తాం.. అత్యవసర చికిత్సలు తప్పక అందించేలా చర్యలు తీసుకుంటాం.

- ఐ.రమేశ్‌, జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారి

-

ఇదీ చదవండి:

తిరుపతిలో కరోనా ఉద్ధృతి.. అధికార యంత్రాంగం అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.