బద్వేలు ఉప ఎన్నిక(badvel bypoll) నేపథ్యంలో.. కడప జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ కారణంగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించినా.. ఎన్నికల ఖర్చు కిందే వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఈ తరహా కార్యక్రమాలను చేపట్టవద్దని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చేపట్టే కార్యక్రమాలపై ఈసీ(ELECTION COMMISSION) దృష్టి పెట్టిందని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌తో పాటు కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ స్పష్టం చేశారు.
ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గంతో పాటు.. జిల్లాలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించినా అది ఎన్నికల వ్యయం కిందే వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకూ బద్వేలు నియోజకవర్గంతో పాటు.. పొరుగున ఉన్న నియోజకవర్గాలు, జిల్లాలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలను చేపట్టవద్దని సూచిస్తూ ఆదేశాలిచ్చారు. బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైన సెప్టెంబరు 28వ తేదీ నుంచి కోడ్ అమల్లో ఉందని.. ఈసీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: