కరోనా ఉద్ధృతి దృష్ట్యా విజయవాడలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఉపసంహరించుకున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అన్నీ యథాతథంగానే ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. మొదట ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించనున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో సైతం కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే ఉత్తర్వులు జారీ చేసిన కొద్దిసేపటికే వాటిని వెనక్కి తీసుకున్నారు.
కృష్ణా జిల్లాలో మంగళవారం కొత్తగా 33 కేసులు నమోదవటంతో మొత్తం కేసుల సంఖ్య 1096కి పెరిగింది. వీటిలో 507మంది కోలుకోగా.. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 40మంది మృతిచెందారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 549 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి
డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షల రద్దు