నేతన్న నేస్తం చేనేతదార్ల సంక్షేమానికి గొడ్డలిపెట్టని తెదేపా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. రాష్ట్రంలో 81 వేల మందికే పథకం ద్వారా లబ్ధిచేకూర్చి..పెద్దసంఖ్యలో చేనేతలకు జగన్ ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 3.5 లక్షల మంది చేనేత వృత్తిదారులకూ పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మగ్గాలున్న చేనేతలకు నేతన్న నేస్తం అమలు చేయాలన్నారు. బడ్జెట్ నిధులను పూర్తిగా నేతన్నల సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరారు. కేంద్రం కేటాయించిన 31 కోట్ల రూపాయల నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.