ETV Bharat / city

Current Cuts in TS: తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్‌ కోతలు.. ఆందోళనలో రైతులు - రాష్ట్రంలో కరెంట్​ కోతలు

Current‌ cuts in Telangana: తెలంగాణలో వ్యవసాయానికి రాత్రి పూట కరెంట్​ కోతలు మొదలయ్యాయి. రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో సింగిల్​ ఫేజ్​ కరెంట్​ మాత్రమే సరఫరా చేస్తూ.. విద్యుత్​ కోత విధిస్తున్నారు. పంటలు చేతికొచ్చే వేళ విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో నీరు చాలడం లేదని పలు ప్రాంతాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Current‌ cuts in Telangana
తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్‌ కోతలు
author img

By

Published : Apr 15, 2022, 9:54 AM IST

Current‌ cuts in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట సింగిల్‌ ఫేజ్‌ కరెంట్‌ మాత్రమే సరఫరా చేస్తూ వ్యవసాయానికి విద్యుత్‌ కోత విధిస్తున్నారు. ఎండలతో విద్యుత్​ వినియోగం పెరగడం.. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో రెండు రోజులుగా ఈ విధానం అమలు చేస్తున్నారు. త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఉంటేనే పొలాల్లో నీటి మోటార్లు నడుస్తాయి. పంటలు చేతికొచ్చే వేళ విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో నీరు చాలడంలేదని పలు ప్రాంతాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన..: ములుగు జిల్లా గోవిందరావుపేటలో గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేశారు. తర్వాత సింగిల్‌ ఫేజ్‌కు మార్చారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ సమయంలో చల్వాయి గ్రామ రైతులు గోవిందరావుపేట సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. పగలు సైతం పూర్తిగా ఇవ్వడంలేదని పలు జిల్లాల రైతులు చెబుతున్నారు.

జిల్లాల వారీగా లోడ్‌ షెడ్యూళ్లు..: విద్యుత్‌ కొరత నేపథ్యంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థలు జిల్లాల వారీగా లోడ్‌ షెడ్యూళ్లను జారీచేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్‌ సరఫరా చేయాలని ఆదేశించగా.. మరికొన్ని జిల్లాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా చేస్తున్నారు. మార్చిలోనూ కొన్ని రోజులు త్రీఫేజ్‌కు కోతలు విధించిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలతో రెండు రోజులుగా సింగిల్‌ ఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేశామని.. శుక్రవారం నుంచి త్రీఫేజ్‌ కరెంట్‌ను పునరుద్ధరిస్తామని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాలరావు తెలిపారు.

  • వికారాబాద్‌ జిల్లాలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సింగిల్‌ ఫేజ్‌ మాత్రమే సరఫరా చేశారు.
  • ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే త్రీఫేజ్‌ ఇచ్చారు.
  • కరీంనగర్‌ జిల్లాలో ఉదయం 10 నుంచి సాయంత్రం గంటల వరకు త్రీఫేజ్‌ సరఫరా చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.