తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొంది. ఎన్ని ఆంక్షలు విధించినా.. మాస్క్ వినియోగం, భౌతిక దూరం వంటి నిబంధనలపై ఎంత అవగాహన కల్పించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల.. కఠిన ఆంక్షలకు ప్రభుత్వం ఉపక్రమించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి కర్ఫ్యూ విధింస్తున్నట్లు ప్రకటించింది. ఈ రాత్రి నుంచి మే 1 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటలకు కర్ఫ్యూ ప్రారంభమైంది. చాలా చోట్ల రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే పోలీసులు మినహాయింపునిస్తున్నారు. ఉల్లంఘనలపై విపత్తు నిర్వహణ, ఐపీసీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూతపడ్డాయి. 9 గంటలలోగా అన్ని బస్సులు డిపోలకు చేరుకున్నాయి. కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, డయోగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మసీలకు మినహాయింపు ఉన్నందున అవి.. యధావిధిగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి వచ్చే వారు టికెట్లు చూపితే అనుమతిస్తున్నారు.
ఇవీచూడండి: