మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విరసం నాయకులు వరవరరావు వైద్య నివేదికలను ప్యానెల్ వైద్య నిపుణులతో పరిశీలించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నిర్ణయించింది. ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన వైద్య నివేదికలు పంపగా కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
నిపుణుల ప్యానెల్ రెండు వారాల్లో కమిషన్ పరిశీలనకు నివేదిక ఇవ్వాలని కోరింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ నిర్ణయం సహేతుకమైనది, ఆమోదయోగ్యమైనదిగా పేర్కొంది.
ఇదీ చూడండి: